రానా – నతాలియతో రొమాంటిక్ థ్రిల్లర్ తీస్తానంటున్న వర్మ

రానా – నతాలియతో రొమాంటిక్ థ్రిల్లర్ తీస్తానంటున్న వర్మ

Published on Mar 3, 2012 12:08 PM IST

రామ్ గోపాల్ వర్మ గ్యాంగ్ నుండి మరో అందాల సుందరి రానుంది. ఆమె మరెవరో కాదు నతాలియ. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న డిపార్టుమెంటు అనే హిందీ చిత్రంలో ఆమె ఐటెం గర్ల్ గా కనిపించబోతుంది. ఈ చిత్రంలోనే కాకుండా వర్మ చేయబోయే ‘అందం’ అనే సినిమాలో కూడా ఆమె ముఖ్య పాత్ర పోషించాబోతున్నట్లు వర్మ రెండు రోజుల క్రితం తన ట్విట్టర్ అకౌంటులో తెలిపాడు. ఈ రోజు మరో అడుగు ముందుకేసి రానా హీరోగా నతాలియ హీరొయిన్ గా రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా తీయబోతున్నాను అని ప్రకటించాడు వర్మ. ఈ కాలంలో ఎంతో మంది హీరోయిన్లు ఐటెం గర్ల్ గా నర్తించడానికి భయపడుతుంటే నతాలియ వర్మ మీద నమ్మకంతో ఒప్పుకుంది. ఆ నమ్మకాన్ని వర్మ నిలబెట్టుకుని ఆమెకు హీరొయిన్ గా అవకాశం ఇచ్చాడు.

తాజా వార్తలు