మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్న అధినాయకుడు

మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్న అధినాయకుడు

Published on Feb 28, 2012 6:07 PM IST


నందమూరి బాలకృష్ణ నటించిన ‘అధినాయకుడు’ అన్ని అడ్డంకులు దాటుకుని విజయవంతంగా త్వరలో మనముందుకు రాబోతుంది. ఈ చిత్ర ఆడియో మార్చ్ 5న విడుదల కాబోతుంది. అధినాయకుడు చిత్రం మార్చి 23న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం బాలకృష్ణ డబ్బింగ్ చెబుతున్నారు. సలోని మరియు లక్ష్మి రాయ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తుండగా ఎమ్ఎల్ కుమార్ చౌదరి నిర్మాత. కళ్యాణి మాలిక్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు