భారి అంచనాల మీద వేసవి కి రానున్న భారి చిత్రాలు

భారి అంచనాల మీద వేసవి కి రానున్న భారి చిత్రాలు

Published on Feb 27, 2012 7:55 PM IST

సిని అభిమానులకు 2012 వేసవి పండుగ కాబోతుంది. ఈ వేసవికి భారి చితాలు విడుదల కానున్నాయి. మొదటగా రామ్ చరణ్ తేజ నటించిన “రచ్చ” విడుదల కానుంది వెంటనే ఎన్ టి ఆర్ “దమ్ము” మరియు పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” లు విడుదల కానున్నాయి. ఈ మూడు చిత్రాల మీద పరిశ్రమ లో పాజిటివ్ టాక్ ఉంది. వేసవి లో జరిగే ఈ పోటి కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు. “గబ్బర్ సింగ్” ట్రైలర్ ఇప్పటికే విడుదల అయ్యింది ఇంకా “రచ్చ” మరియు “దమ్ము” చిత్ర ట్రైలర్ లు రావాల్సి ఉంది. మూడు చిత్రాలు నిర్మాతలు చాలా శ్రద్ద తీసుకొని చేస్తున్నారు ఎక్కడా వెనుకాడకుండా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు కావున ఈ చిత్రాల మీద అంచనాలు మరింత పెరిగాయి. వారి అంచనాలు నిలబడాలని కోరుకుందాం.

తాజా వార్తలు