రజినీ కాంత్ కోసం అభిమానుల పాదయాత్ర

rajinikanth

సూపర్ స్టార్ రజినీ కాంత్ కి సౌత్ ఇండియాతో పాటుగా నార్త్ ఇండియా, జపాన్ మరియు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఏరియాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. రజినీ కాంత్ నటించిన ‘కొచ్చాడియాన్’ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా విడుదల సందర్భంగా నెల్లూరుకి చెందిన ఓ అభిమాన సంఘం తమ అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకోనున్నారు. రెండు సంవత్సరాల తర్వాత వస్తున్న రజినీ కాంత్ కొచ్చాడియాన్ మూవీ సూపర్ హిట్ కావాలని నెల్లూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయనున్నారు. నెల్లూరు రజినీ కాంత ఫ్యాన్ క్లబ్ ట్రెజరర్ ఎన్. రవి న్యాయకత్వంలో ఏప్రిల్ 2న పాదయాత్ర మొదలు కానుంది. కొచ్చాడియాన్ మూవీ హిట్ అవ్వాలని, రజినీ ఆరోగ్యం బాగుండాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్లు వారు తెలియజేశారు.

రజినీ కాంత్, దీపిక పడుకొనే, శోభన, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి సౌందర్య రజినీకాంత్ అశ్విన్ డైరెక్టర్. కెఎస్ రవి కుమార్ కథ – స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

Exit mobile version