సౌత్ ఆడియన్స్ ని తెగ పొగిడేసిన తమన్నా

tamannah-bollywood-movie
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకొని ఇక్కడే సినిమాలు చేస్తున్న మిల్క్ బ్యూటీ తమన్నా మధ్య మధ్యలో బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ట్రై చేస్తోంది. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్న తమన్నా సౌత్ ఇండియన్ ఆడియన్స్ ని తెగ పొగిడేస్తోంది..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఫిల్మ్ ఆడియన్స్ గురించి తమన్నా చెబుతూ ‘ సౌత్ ఆడియన్స్ తాము అభిమానించే స్టార్స్ పట్ల ఎంతో ఎమోషనల్ గా అటాచ్ అయిపోతారు. చెప్పాలంటే స్టార్స్ ని దేవుడిలా చూస్తారు. అలాగే వాళ్ళ ఫామిలీలో మనం కూడా ఒకరం అనుకుంటారు. మనం తెరపైన చేసేదాన్ని పర్సనల్ గా తీసుకుంటారు. అబ్రాడ్ లో ఉండే సౌత్ ఇండియన్స్ అయినా సరే సినిమాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న గ్రామాల్లో కూడా మనల్ని అభిమానించే వారు ఉంటారు. వారి అభిమానాన్ని మాటల్లో చెప్పలేం అని’ తెలిపింది.

అలాగే తను బాలీవుడ్ లో సినిమాలు చేసినా సౌత్ ఇండియానే తనకు స్పెషల్ అని ఈ మిల్క్ బ్యూటీ చెబుతోంది. తమన్నా ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన ‘ఆగడు’, ప్రభాస్ సరసన ‘బాహుబలి’ సినిమాల్లో నటిస్తోంది.

Exit mobile version