రజినికాంత్ మరియు కమల్ హాసన్ గత 40 సంవత్సరాలుగా సన్నిహితంగా నిలుస్తూ 70వ దశకంలో తమిళ సినిమాలో పాతుకుపోయారు. వారి కెరీర్ మొదట్లో కొన్ని మంచి చిత్రాలలో కలిసి నటించినా 80వ దశకంలో ఎవరి దారి వారు పట్టారు. తమ వర్గానికి చెందిన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు
ఇప్పుడు చాలా కాలం తరువాత వీరిద్దరూ కలిసి నటించనున్నట్లు సమాచారం. కోలీవుడ్ వర్గాల ప్రకారం కమల్ హాసన్ ఉత్తమ విలన్ సినిమాలో రజినీకాంత్ ఒక ముఖ్యపాత్ర పోషించనున్నాడు. కమల్ హాసన్ ఈ పాత్రకోసం రజినీని సంప్రదించినట్టు సమాచారం. ఇంకా ఏ విషయం అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ రజినీ గనుక ఒప్పుకుంటే ఈ సినిమాకు ఆ పాత్ర అదనపు ఆకర్షణగా నిలుస్తుంది
ఈ సినిమాలో కమల్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. 8వ దశకంలో డ్రామా నటుడిగా కొంత భాగం సాగిన ఈ సినిమాలో 21వ దశకంలో సూపర్ స్టార్ పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమాలో యాండ్రియా, పూజా కుమార్, పార్వతీ మీనన్, ఊర్వశి, కే విశ్వనాద్, బాలచందర్ తదితరులు నటిస్తున్నారు. రమేష్ అరవింద్ దర్శకుడు