నాకు మోహన్ బాబున అంటే చాలా కోపం – రాంగోపాల్ వర్మ

ram-gopal-varma

తనకు వచ్చిన ప్రతి సందర్బాన్ని తనకు అనుగుణంగా మార్చుకోవడంలో మంచి పేరున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. తన వివాదాస్పద వ్యాఖ్యలతో, రెచ్చగొట్టే ప్రకటనలతో తన సినిమాలకు మంచి ప్రచారం చేసుకునే ఈ దర్శకుడు, ఇటివల జరిగిన ‘రౌడీ’ ఆడియో విడుదల కార్యక్రమంలో నటుడు మోహన్ బాబుపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్మ మాట్లాడుతూ,’నాకు మోహన్ బాబు అంటే ద్వేషం’, అని అన్నారు. అయితే దీనికి కారణం కూడా వర్మ వివరించాడు.

‘నాకు నటి జయసుధ అంటే చాల ఇష్టమని, కానీ ‘శివరంజని’ సినిమాలో మోహన్ బాబు జయసుధని చాలా ఇభందులకు గురిచేసాడని, అందుకనే నాకు మోహన్ బాబు అంటే చాలా కోపం’, అని అయన అన్నారు.

మోహన్ బాబుతో పాటు జయసుధ కూడా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Exit mobile version