జులై నుండి మహేష్ – కొరటాల శివ సినిమా

mahesh-babu-koratala-shiva
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో రావడానికి రంగం సిద్ధమయ్యింది. యు.టి.వి మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై నుండి మొదలుకానుంది. అతిధి తరువాత ఈ సంస్థ మహేష్ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమా గతఏడాది ఖరారయినా కార్యరూపం దాల్చడానికి ఇంత సమయం పట్టింది

ప్రస్తుతం కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా వున్నాడు. తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటిస్తున్నారు. యు.టి.వి సౌత్ డివిజన్ హెడ్ అయిన ధనంజయన్ గోవింద్ గతకొన్ని రోజులుగా తరచూ హైదరాబాద్ పర్యటిస్తూ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నారు. మిర్చితో విజయం సాధించిన తరువాత కొరటాల శివ మహేష్ తో తీస్తున్న సినిమా ఇది

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీనువైట్ల ఆగడు సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది. తమన్నా హీరోయిన్

Exit mobile version