ఏప్రిల్ 11న విడుదలకానున్న రజని ‘కొచ్చాడయాన్’

rajnikanths_Kochadaiiyaan

సూపర్ స్టార్ రజినికాంత్ అభిమానులకు ఒక శుభవార్త. సెన్సార్ బోర్డు వద్ద క్లీన్ సర్టిఫికేట్ పొందిన ‘కొచ్చాడయాన్’, ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజిని కూతురు సౌందర్య అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కొచ్చాడయాన్’ భారతదేశంలోనే మొట్ట మొదటి మోషన్ కాప్చర్ యానిమేటెడ్ 3డి చిత్రం.

రాజినితో పాటు, ఈ సినిమాలో దీపిక పాడుకొనే మరియు జాకీ శరోఫ్ఫ్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు మీడియా వన్ గ్లోబల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘కొచ్చాడయాన్’కు ఎఅర్.రహమాన్ సంగీతాన్ని అందించారు.

Exit mobile version