పరీక్షలు సమయం కావున, చాల సినిమా నిర్మాతలు తమ చిత్ర విడుదలలును వాయిద వేసుకుంటున్నారు. అయితే ఈ వారం కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ‘భద్రమ్’ పైనే అందరి చూపు.
తమిళనాడు లో ‘తెగిడి’ పేరుతో విడుదలై ప్రేక్షకాదరణ పొంది, తెలుగు లో ‘భద్రమ్’గా విడుధలవబోతుంది. పెద్ద చిత్రాలేవి ఈవారం విడుదలకు లేకపోవడంతో, ‘భద్రమ్’పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అశోక్, జననిలు హీరో హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాలో విరి నటన హైలైట్ గా నిలువనుంది.
నివాస్ సంగీతం అందించిన ‘భద్రమ్’కి రమేష్ దర్శకత్వం వహించారు. శ్రేయస్ మీడియా మరియు బి. రామకృష్ణ రెడ్డిలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.