ముఖ్యమైన మైలురాయిని అందుకునే దిశగా ఇళయరాజా

Ilayaraja
35సంవత్సరాలుగా మనదేశ ఖ్యాతిని పెంపొందించుతూ సంగీత సాగరంలో మనల్ని రమింపజేసిన ఘనత ఇళయరాజా గారిది. ఆయన అందించిన ఎన్నో మధురమైన పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల చెవులలో మార్మోగుతూనే వున్నాయి

ఇప్పుడు అయన కెరీర్ లో ఒక మైలురాయిని చేరుకునే క్రమంలో వున్నారు. బాలా తీస్తున్న ‘తారై తప్పట్టై’ అనే తమిళ సినిమా ఆయనకు 1000వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాలో శశికుమార్, వరలక్ష్మి శరత్ కుమార్ లు ప్రధానపాత్రధారులు. ఈ సినిమాలో శశికుమార్ నాదస్వరం వాయించే వాడి పాత్ర పోషిస్తే వరలక్ష్మి శరత్ కుమార్ కరగట్టాం డ్యాన్సర్ పాత్ర పోషిస్తుంది. దీనికోసం వరలక్ష్మి శరత్ కుమార్ ప్రత్యేక శిక్షణ తీసుకుందని సమాచారం

ప్రస్తుతం తెలుగులో ఇళయరాజా గుణశేఖర్ రుద్రమదేవి, ప్రకాష్ రాజ్ ఉలవచారు బిర్యాని సినిమాలకు స్వరాలను అందిస్తున్నారు

Exit mobile version