‘రౌడీ’ కోసం డబ్బింగ్ పూర్తి చేసుకున్న మోహన్ బాబు

mohan-babu
తాజాగా వస్తున్న ‘రౌడీ’ సినిమాకు గాను డా. మోహన్ బాబు తన డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు.తన సిని కెరీర్ లో ఎప్పుడు చేయని ఒక పవర్ ఫుల్ పాత్ర మోహన్ బాబు ఈ చిత్రం లో చేస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. మోహన్ బాబు సన్నివేశాలకు, డైలాగులకు మంచి ప్రేక్షకులను అక్కట్టుకుంటునాయి.

చాలా కాలం తరువాత నటి జయసుధ మోహన్ బాబు తో జతకట్టారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ రాయలసీమ లో జరిగింది.
యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ‘రౌడీ’ ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాలకే 8000 మంది వీక్షకులను ఆకర్షించింది.

Exit mobile version