తుది దశలో ఉన్న ‘లెజెండ్’ రి రికార్డింగ్

Legend
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న ‘లెజెండ్’ రీ రికార్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంగిత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది, ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

‘లెజెండ్’లో బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే మరియు సోనాల్ చౌహన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా లో ఓ పాత్ర ‘సింహ’లో పాత్రలా పవర్ ఫుల్ గా ఉండ్డబోతుంది.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు. ఈ బారి బడ్జెట్ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ మరియు వారాహి చలనచిత్రం వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version