జన సేన కేవలం పవన్ కు మాత్రమే సొంతం

pawan-kalyan

పవన్ జన సేన పార్టీని స్తాపించిన రెండో రోజే ఆ పార్టీ కార్యాలయం నుండి ఈ పార్టీకి అన్ని అధికారాలూ పవన్ కు మాత్రమే వున్నాయని ప్రకటన ఇచ్చేసింది. తన పార్టీ గురించి ఆలోచన వచ్చిన దగ్గరనుండి మీడియా, కొంతమంది ప్రముఖులు ఈ పార్టీ పై రకరకాల ఊహాగానాలు చేసుకొచ్చారు.

“పవన్ కళ్యాణ్ తప్ప ఈ పార్టీకి సంబంధించిన విషయాలు, విశేషాలు మరెవరికీ తెలియవని.. ఆయనే అధికారిక వ్యక్తి” అని చెప్పారు. పార్టీ ఇప్పుడే ఆవిర్భవించింది అప్పుడే ఎన్నికల గురించి మాట్లాడడం సబబుకాదన్నారు. కాంగ్రెస్ తో తప్ప మరే ఇతర పార్టీతోనన్నా కలవడానికి సిద్దమని ఆయన ఇటీవలే స్పీచ్ లో చెప్పారు

అంతేకాక పవన్ ‘ISM’ అనే పుస్తకాన్ని రాజు రవీంద్ర సహకారంతో విడుదలచేసారు. వీరిద్దరూ జన సేన పార్టీ భవిష్యత్తులో తీసుకోబోయే కార్యాచరణను ఇందులో వెల్లడించారని సమాచారం

Exit mobile version