పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం రోజున ఇచ్చిన స్పీచ్ చాలా మంది గుండెలను కదిలించింది. పవన్ కు మద్దతు తెలిపే సినిమా ప్రముఖుల జాబితా రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ లిస్టులో సీనియర్ నటుడు సురేష్ కూడా చేరారు
పవన్ ని పొగుడుతూ సురేష్ యు ట్యూబ్ లో ఒక వీడియోని పోస్ట్ చేసారు. “నేను పవన్ ఆలోచనలను పూర్తిగా అంగీకరిస్తున్నాను. దేశానికి ఏదో మంచి చెయ్యాలన్న ఇటువంటి డేరింగ్ వ్యక్తిని నేను ఇప్పటిదాకా చూడలేదు. ఆయన ప్రసంగానికి కదిలిపోయిన నేను ఆయనకు పూర్తి మద్దతు ఇస్తున్నాను” అని తెలిపాడు. హైదరాబాద్ లో పవన్ జన సేన పార్టీని ప్రారంభించిన విషయం తెలిసినదే