దక్షిణాదికి చెందిన హీరోలలో ఫేస్ బుక్ లో 2.5మిలియన్ లైకులను సంపాదించిన ఏకైక హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. కేరళ, కర్నాటక రాష్ట్రాలలో కూడా ఫ్యాన్స్ ను సంపాదించడం వలనే రజిని కాంత్, కమల్ హాసన్ వంటి వారిని కూడా దాటగలిగాదని సమాచారం. ఈ మాధ్యమంపై ఇంతటి స్పందన రావడంతో మన స్టైలిష్ స్టార్ చాలా హ్యాపీగా వున్నాడు
అల్లు అర్జున్ కొత్త సంవత్సరాన్ని ఆస్ట్రేలియాలో జరుపుకొనున్నాడు. అతను నటిస్తున్న ‘రేస్ గుర్రం’ రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తిచేసుకుంది. సురేందర్ రెడ్డి దర్శకుడు. శృతిహాసన్, సలోనీ హీరోయిన్స్. రవికిషన్ విలన్ పాత్ర పోషించాడు. ఈ సినిమా 2014 ప్రధామార్ధంలో మనముందుకు రానుంది. అల్లు అర్జున్ త్వరలో వస్తున్న ‘ఎవడు’ సినిమాలో అతిధిపాత్ర పోషించిన విషయం తెలిసినదే.
CLICK HERE FOR Allu Arjun’s Face Book Page