‘1’ కి డబ్బింగ్ చెప్పిన 70 మంది ఆర్టిస్టులు

1_Nenokkadine_New_Poster-(5
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘1-నేనొక్కడినే’. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో చాలా మంది ప్రజలు పాల్గొంటారు. అయితే వారందరి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఒకే సారి ఈ డబ్బింగ్ లో దాదాపు 70మంది పాల్గొంటున్నారు. ఈ సినిమా జనవరి 10 న విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో కృతి సనన్ తెలుగులో పరిచయం అవుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక కొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను లండన్, బ్యాంకాక్ లలో షూట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు వున్నాయని భావిస్తున్నారు. ఈ సన్నివేశాలను ఇంటర్నేషనల్ టెక్నిషియన్స్ తో నిర్మించారని సమాచారం.

Exit mobile version