త్వరలో మొదలుకానున్న గబ్బర్ సింగ్ 2

Gabbar-Singh
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్న ‘గబ్బర్ సింగ్ 2’ అతని హృదయానికి దగ్గరగా వున్న ప్రాజెక్ట్ అట. ‘గబ్బర్ సింగ్’ సినిమా అతని కెరీర్ లోనే టాప్ పొజిషన్ లో వున్న సినిమా. కాబట్టి ఈ సీక్వెల్ పై చాలా అంచనాలు వుంటాయని తనకి తెలుసు. అందుకే ప్రీ ప్రొడక్షన్ పనులలో జాప్యం జరుగుతున్నా తగు సమయం తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీమ్ కధ పై చాలా కసరత్తు చేస్తున్నాడు

ఈ సినిమా ఇప్పుడు మొదలవడానికి సిద్ధమయ్యింది. సంపత్ నంది దర్శకుడు. ఇంకా అధికారికంగా హీరోయిన్ పేరును ప్రకటించకపోయినా పలు పేర్లు వినిపిస్తున్నాయి. పవన్ ప్రస్తుతం ‘అత్తారింటికి దారేది’ విజయానందంలో వున్నాడు. త్వరలో ‘గబ్బర్ సింగ్ 2’ రూపంలో మనముందుకు రానున్న పవర్ స్టార్ కు హిట్ రావాలని కోరుకుందాం

Exit mobile version