తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘పిజ్జా’ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసారు. తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాని ఇప్పుడు ఇంగ్లీష్ లో డబ్బింగ్ చేయనున్నారు. అసలు విషయం ఏమిటంటే ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాని చూసి ఇంగ్లీష్ లోకి డబ్ చెయ్యడానికి రైట్స్ తీసుకున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ సుబ్బరాజ్ ఇంగ్లీష్ వెర్షన్ డబ్బింగ్ కూడా చూసుకుంటున్నారని అన్నాడు. ఇంగ్లీష్ డబ్బింగ్ కి ఈ చిత్ర నిర్మాత సివి కుమార్ కూడా అంగీకరించినట్లు సమాచారం.
కార్తీక్ సుబ్బరాజు, రమ్య నంబీసన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఓ పిజ్జా బాయ్ చుట్టూ తిరుగుతుంది. బాగా ఇంటెలిజెంట్ గా డీల్ చేసిన ఈ సినిమా బాలీవుడ్ లో కూడా రీమేక్ అయ్యింది.