ముని 3 లో తన పాత్ర బయటపెట్టిన తాప్సీ

Taapsee
ప్రస్తుతం తాప్సీ హర్రర్ కామెడీ అయిన ముని 3 షూటింగ్ లో బిజీగా వుంది. ఈ సినిమా రాఘవా లారెన్స్ స్వీయదర్శకత్వంలో వస్తుంది. నిత్యామీనన్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తుంది. ఈ నెల షూటింగ్ మొదలుకాగానే రాఘవ లారెన్స్ గ్యాప్ లేకుండా చిత్రీకరిస్తున్నాడు

ఒక ఇంటర్వ్యూలో తాప్సీ తను టి.వి సిరీస్ దర్శకురాలిగా కనిపించనుంది. ఈ సినిమా మొత్తంలో ఆమె సీరియస్ గా కనిపించనుంది. ఈ భామ జర్నలిస్ట్ గా నటించిన ‘ఆరంభం’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తన కెరీర్ లోనే చాలా కష్టమైన పాత్ర పోషిస్తుందట. ఈ సినిమా సిరీస్ లో రెండో భాగమైన కాంచన ఘనా విజయం సాధించింది. బెల్లంకొండ సురేష్ ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలొ 2014 కి మనముందుకు తీసుకురానున్నారు

Exit mobile version