వాయిదాపడిన మహేష్ ‘1’ సినిమా ఆఖరిపాట

1Nenokkadine
మహేష్ బాబు నటిస్తున్న ‘1- నేనొక్కడినే’ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా లో మిగిలిన ఆఖరి పాటను ఈవారంలో ముంబై ప్రాంతంలో చిత్రీకరించాలి అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్ డిసెంబర్ 11 కి మారిందని సమాచారం

ప్రస్తుతం మహేష్ ‘ఆగడు’ షూటింగ్ లో వున్నాడు. ‘1’ సినిమాకు సుకుమార్ దర్శకుడు. ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ లో పోరాట సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి మహేష్ లుక్ పై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. కృతి సనన్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రామ్ ఆచంట, గోపీచంద్ మరియు అనీల్ సుంకర ఈ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను జనవరి 10న విడుదలచేయనున్నారు

Exit mobile version