ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు యాక్సిడెంట్ అయ్యింది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి
ప్రభాస్ ఈ ఫేస్ బుక్ ద్వారా ఈ కధనాలను నిరాకరించాడు. “బాహుబలి షూటింగ్ లో నాకు యాక్సిడెంట్ అన్న మాట అవాస్తవం. నేను బానే వున్నా, కేరళ లో షూటింగ్ బానే జరుగుతుంది. నామీద అభిమానానికి కృతజ్ఞుడ్ని” అని తెలిపాడు
ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ ద్వారా శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె. రాఘవేంద్ర రావు సమర్పకుడు. ఎం.ఎం కీరవాణి సంగీతదర్శకుడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్