ఈ నెలాఖరున రానున్న నిఖిల్ ‘కార్తికేయ’ టీజర్

Nikhil-Swathi
యంగ్ హీరో నిఖిల్ – స్వాతి ‘స్వామి రారా’ సినిమా తర్వాత మరోసారి జోడీ కట్టిన థ్రిల్లర్ సినిమా ‘కార్తికేయ’. ఈ సినిమా ఫస్ట్ టీజర్ ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేయనున్నారు. ‘కార్తికేయ’ ద్వి భాషా చిత్రంగా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

చందు మొండేటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ‘స్వామి రారా’ సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ – స్వాతి అదే హిట్ ని మరోసారి రిపీట్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. రాజేష్ వర్మ సమర్పణలో బొగ్గరం వెంకట శ్రీనివాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

Exit mobile version