సినీ ఎంట్రీకి సిద్దమైన కమల్ హాసన్ రెండవ కుమార్తె

Akshara_Haasan
అక్షర హాసన్ అంటే కొద్ది మందికి తెలియక పోవచ్చు కానీ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ రెండవ కుమార్తె, శృతి హాసన్ చెల్లెలు అంటే అందరికీ తెలుస్తుంది. అక్షర హాసన్ హీరోయిన్ గా పరిచయం కావడానికి రంగం సిద్దమైంది. మేము విన్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో డైరెక్టర్ ఆర్. బల్కి డైరెక్ట్ చేయనున్న ఓ బాలీవుడ్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కానుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ప్రస్తుతానికయితే ఈ సినిమాలో అక్షర హాసన్ రోల్ ఎలా ఉంటుందనేది తెలియలేదు. అక్షర సౌత్ ఇండియన్ సినిమాలు కూడా చేస్తుందా లేక బాలీవుడ్ సినిమాలు మాత్రమే చేస్తూ అక్కడే ఉంటుందా? అనేది చూడాలి. బహుశా మొదటి సినిమా సక్సెస్ అక్షర కెరీర్ ని నిర్ణయిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే అక్షర హాసన్ కి గుడ్ లక్ చెబుతున్నాం..

Exit mobile version