వెంకటాద్రి ఎక్స్ప్రెస్స్ దర్శకుడిని పొగిడిన రమణగోగుల

ramana-gogula-and-director-
గత చిత్రాలలో హిట్ సినిమాలకు సూపర్ హిట్ పాటలను అందించిన సంగీత దర్శకుడు రమణగోగుల. చాన్నాళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న అతనకి ఈ ఫీల్డ్ లో లాభనష్టాలు తెలుసు. అతని నూతన సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్స్’ పై ఆటను చాలా నమ్మకంగా వున్నాడు. ఈ చిత్ర దర్శకుడు గాంధీని పొగడ్తలలతో ముంచెత్తాడు.

రమణ గోగుల రెడ్ ఎఫ్.ఎం కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “గాంధి ఆలోచనా ధోరణి చాలా వైవిధ్యంగా వుంటుంది. ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా ఆలోచిస్తాడు. అలాంటి దర్శకుడు వుంటే మా పని చాలా సులభమవుతుంది. ఇటువంటి వారు ఇండస్ట్రీకి చాలా అవసరం” అని తెలిపాడు

జెమినీ కిరణ్ ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ హీరో. రాకుల్ ప్రతీక్ సింగ్ హీరోయిన్. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. గౌతం రాజు ఎడిటర్

Exit mobile version