హైదరాబాద్ లో జండా పై కపిరాజు షూటింగ్

Jendapai Kapi Raju
నాని నటిస్తున్న ‘జండా పై కపిరాజు’ షూటింగ్ చివరిదశలో వుంది. ఇప్పటివరకూ కోయమబత్తూర్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు హైదరాబాద్ కు మకాం మార్చింది. నాని, అమలా పాల్ ప్రధాన తారలు. సముద్రఖని దర్శకుడు. కె.ఎస్ శ్రీనివాసన్ ఈ ద్విభాషా చిత్రాన్ని వాసన్ విజువల్ వెంచర్స్ ద్వారా నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం నాని నటిస్తున్న ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో మరికొన్ని రోజులుసాగనుంది. జయం రవి అమలా పాల్ నటించిన తమిళ వర్షన్ త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా సామాజిక అంశాలను మేళవించిన ఒక క్లీన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కుతుంది. జి.వి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రెండు పూర్తి విభిన్న పాత్రలలో నాని కనిపిస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశిద్దాం

Exit mobile version