సెన్సార్ పూర్తి చేసుకున్న అనుష్క ‘వర్ణ’

Varna
అనుష్క నటించిన భారీ బడ్జెట్ తో, మంచి విసువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ‘వర్ణ’ సినిమా ఈ నెల 22న విడుదల కావడానికి సిద్దం అవుతోంది. ఈ సినిమా తెలుగు వర్షన్ కు సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. ఈ సినిమాలో ఎటువంటి కట్ లు చేయకుండా సెన్సార్ వారు యూ సర్టిఫికేట్ ను ఇవ్వడం జరిగింది. అలాగే తమిళ వర్షన్ లో గత కొన్నిరోజులకు ముందే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి అక్కడ కూడా యూ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా రెండు భాషలలో విడుదలవుతోంది. తమిళ వర్షన్ లో ఈ సినిమా టైటిల్ ‘ఇరండం ఉలగమ్’. ఈ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన సింగపూర్, మలేషియా రైట్స్ ని అతనే తీసుకున్నాడు. హర్రిస్ జయరాజ్ సంగీతాన్ని అందించగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ సినిమాని పీవీపీ సినిమా బ్యానర్ పై ప్రసాద్ వీ పొట్లూరి నిర్మించారు.

Exit mobile version