రామ్ గోపాల్ వర్మ రీజనల్ సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ధనలక్ష్మి పై క్రిమీనల్ కేసు పెట్టనున్నట్టు నిన్న ప్రెస్ మీట్ లో తెలియజేశారు. అలాగీ ఈ రోజు ధనలక్ష్మి చేసిన అవినీతిని 12 గంటలకి టీవీ చానల్ లో రివీల్ చేస్తానని వర్మ తెలియజేశాడు.
రామ్ గోపాల్ వర్మ తీసిన ‘సత్య 2’ రిలీజ్ కి ముందు రోజు కొన్ని సెన్సార్ సమస్యలను ఎదుర్కొంది. అప్పుడు ధనలక్ష్మి పెట్టిన టార్చర్, అవినీతి, బిహేవియర్ లాంటి వాటిని వర్మ ఈ టీవీ షోలో చెప్పనున్నాడు. అలాగే ఆయన చేస్తున్న ఇది పబ్లిక్ స్టంట్ అని కొందరు అన్న వార్తలని వర్మ కొట్టి పారేశాడు. అలాగే ఆయన నాంపల్లి కోర్టులో ఈ రోజు కేసు ఫెయిల్ చేయనున్నారు, అలాగే ఆ కాపీని వర్మ లాయర్ మీడియాకి అందజేసే అవకాశం ఉంది.
ఇప్పటి వరకూ టాలీవుడ్ లో ధనలక్ష్మి వల్ల ఎదుర్కొన్న నిర్మాతలను కూడా బాగా ఇబ్బంది పెట్టి ఉంది దాని వల్ల వర్మకి వాళ్ళ సపోర్ట్ ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు.