డబ్బింగ్ పనులు మొదలైన నితిన్ హార్ట్ ఎటాక్

Nithin1
ప్రస్తుతం హైదరాబాద్ లో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా వచ్చే యేడాది జనవరిలో విడుదలకు సిద్ధమవుతుంది. ఐతే ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలపై దృష్టిపెట్టిన ఈ చిత్రం డబ్బింగ్ పనులను మొదలుపెట్టింది

ఆదా శర్మ ఈ సినిమాలో నితిన్ సరసన నటిస్తుంది. పూరి జగన్ దర్శకత్వంలో ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటెర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. స్పైయిన్ లో ఒక షెడ్యూల్ ను ముగించుకున్న ఈ సినిమా త్వరలో గోవా షెడ్యూల్లో పాల్గొనుంది.

అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్. ఎస్.ఆర్ శేఖర్ ఎడిటింగ్ బాధ్యతలు వహిస్తున్నాడు

Exit mobile version