స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రేసుగుర్రం’ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలను చిత్రికరిస్తున్నారని సమాచారం. శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సలోని సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని జనవరి 2014లో విడుదల చేయడానికి వేగంగా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. నల్లమలపు బుజ్జి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గత కొద్ది రోజులుగా హిట్ లేని సురేందర్ రెడ్డి ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.