డిసెంబర్ లో హార్ట్ ఎటాక్ ఆడియో

Puri-Nithin
నితిన్ నటించిన గత రెండు సినిమాలు ‘ఇష్క్’ మరియు ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఘన విజయాలు సాధించడంతో ఆనందంలో వున్నాడు. అతను నటిస్తున్న మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి

ప్రస్తుతం తను నటిస్తున్న ‘హార్ట్ ఎటాక్’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ చిత్రం స్పెయిన్ షెడ్యూల్ ను ముగించుకుంది. గత నెలరోజులుగా స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. నితిన్ ఈ సినిమాలో తన వస్త్రధారణ మరియు కేశాలంకరణ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నాడు. ఈ సినిమా ఆడియో డిసెంబర్ 2 వ వారంలో సినిమాను సంక్రాంతి సమయంలో మనముందుకు తీసుకురానున్నారు

అదాః శర్మ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది . అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. పూరి జగన్నాధ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడమేకాక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు

Exit mobile version