యంగ్ టైగర్ ఎన్ టి ఆర్, డైరెక్టర్ కొరటాల శివ కలిసి ఒక కొత్త సినిమాకి పని చేయనున్నారు. ఈ సినిమాకి సంబందించిన ముహూర్తం కార్యక్రమాలు డిసెంబర్ నెలలో జరిగే అవకాశం వుందని తాజా సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సినిమాని దానయ్య నిర్మించవచ్చునని భావిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల చేయనున్నారు. అలాగే త్వరలో ఈ సినిమాలో నటించనున్న నటినటులు, మ్యూజిక్ డైరెక్టర్ మొదలగు వారి గురించి త్వరలో తెలియజేయవచ్చు. ప్రస్తుతం ఎన్ టి ఆర్ ‘కందిరీగ’ వాసు దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. కొరటాల శివ తీసిన ‘మిర్చి’ సినిమా మంచి విజయాన్ని సాదించింది. ఎన్ టి ఆర్ తో తీయనున్న సినిమా ముగిసిన తరువాత ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయనున్నాడు.