యంగ్ హీరో శర్వానంద్ – నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘ఏమిటో ఈ మాయ’. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలను శర్వానంద్ పూర్తి చేసాడు.
ఈ సినిమాలో నిత్యా మీనన్ పాత్ర స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని ఆశిస్తున్నారు. ఈ సినిమా పెద్దలకు పిల్లలపై ఉండే కోరికల చుట్టూ, అలాగే పెళ్లి అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి చేరన్ దర్శకుడు. స్రవంతి రవికిషోర్ ఈ సినిమాకి నిర్మాత.