అది సెట్ అని చెప్తే చార్మీ నమ్మలేదు – రవీందర్

ravinder-reddy-art-director

దర్శకుడు ఏదైనా బ్యాక్ డ్రాప్ లో తీయాలనుకున్న కథాంశంకి లేదా ఓ సెట్ ఇలా ఉండాలి అనుకున్నప్పుడు ఆ భావాలను సరిగా అర్థం చేసుకునే కళా దర్శకుడు దొరికితే ఆ సెట్ తెరపై ఎంతో అద్భుతంగా ఉంటుంది. ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సినిమాలకు అద్భుతమైన సెట్స్ ని రూప కల్పన చేసి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ ఆర్ట్ డైరెక్టర్స్ ఒకరుగా రవీందర్ పేరు తెచ్చుకున్నారు.

ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సెట్ అనేది కథకి అద్దం పట్టేలా ఉండాలని అన్నారు. అలాగే మాట్లాడుతూ ‘ కళా దర్శకునికి కథ తెలియాల్సిన అవసరం లేదంటారు. నేను మాత్రం కథ అడుగుతాను. ‘ఐతే’ సినిమాకి ఓ కిళ్ళీ కొట్టు సెట్ వేసాను, కానీ సెట్ అని ఎవరూ నమ్మలేదు. చెప్పాలంటే సెట్లోని ఓ వ్యక్తి అక్కడికి వెళ్ళి ఓ సిగరెట్ ఇమ్మని అడిగాడు. సెట్ అంతా నవ్వులు అలాగే నేను దాన్ని ప్రశంశలా తీసుకున్నాను. అలాగే రాఖీ సినిమా టైంలో ఓ ఇంటి సెట్ ని వేశాం. ఓ సీన్ తీస్తున్నప్పుడు చార్మీ చీర సెట్ కి మ్యాచ్ అవ్వకపోవడంతో కాస్ట్యూమ్ చేంజ్ అంటే దూరంగా ఉన్న ఓ ఇంటిని చూపించాం. అప్పుడు చార్మీ పక్కనే ఇల్లు పెట్టుకొని అక్కడికి వెళ్ళమంటారేంది అని అడిగింది. అది సెట్ అమ్మా తల్లీ అని చెప్పినా నమ్మలేదు. అందుకే సెట్ అనేది కథకి అద్దం పట్టేలా ఉండాలని అంటానని’ అన్నాడు.

Exit mobile version