సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘1- నేనొక్కడినే’ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమా జనవరి 10, 2014 న విడుదల కావడానికి సిద్దమవుతోంది. గతంలో మేము చెప్పినట్టుగా ఈ సినిమా ఏరియా రైట్స్ విడుదలకు ముందే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం. ఈ సినిమా కోసం పలు ప్రాంతాలలో భారీగా పోటి నెలకొందని తెలిసింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా ఏరియా రైట్స్ మాదిరిగానే ఆడియో కి కూడా మంచి స్పందన వస్తుందని వారు తెలియజేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కృతి సనొన్ హీరోయిన్ గా నటిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.