కోలీవుడ్ లో మన్ననలను పొందుతున్న రానా

Rana-Daggubati
భారతదేశంలో చాలా ప్రాంతాల సినిమా ప్రియులకు దగ్గుబాటి రానా సుపరిచితుడు. బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించిన రానా ఇటీవలే అజిత్ నటించిన ‘ఆరంభం’ సినిమాలో నటించి ప్రశంసలు అందుకుంటున్నాడు

‘ఆరంభం’ సినిమాలో ముంబై దాడులలో ప్రాణాలు కోల్పోయిన హేమంత్ కర్కారే ను చూసి ఆదర్శం పొంది రూపొందించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రను రానా పోషించాడు . ఈ సినిమాలో కనిపించింది 15 నిముషాలే అయినా రానా తన ప్రతిభను చాటుకున్నాడు. తమిళ మీడియా అతన్ని పొగడ్తల్లో ముంచేస్తుంది. అతని నుండి మరిన్ని తమిళ సినిమాలను ఆశిస్తుంది

అజిత్, ఆర్య, నయనతార మరియు తాప్సీ ప్రధానపాత్రధారులు. విష్ణువర్ధన్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా అన్ని చోట్లా హౌస్ ఫుల్ గా నడుస్తుంది

Exit mobile version