త్వరలో విడుదలకానున్న పైసా??

nani-in-paisa

కెరీర్ లోనే సూపర్ ఫాం లో వున్న నానికి పైసా సినిమా ఒక విధంగా అడ్డుగోడనే చెప్పాలి . ఈ సినిమా విడుదలకాకుండా చాలా రోజులుగా జాప్యం జరుగుతుంది.

ఈ సినిమా షూటింగ్ ముగించుకుని చాలా రోజులయ్యింది. ఆడియో రిలీజ్ కూడా చాన్నాళ్ళ క్రితమే జరిగింది. ఈరోజు ఈ సినిమా నిర్మాత బృందం నుండి అతి త్వరలో విడుదల అనే పోస్టర్ ను విడుదల చేసారు. ఇదివరకు ఈ సినిమా హక్కులను బెల్లంకొండ సురేష్ కొంటాడని వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమా విడుదల జాప్యానికి కారణాలు ఇవేనంటూ పలు పుకార్లు మీడియాలో తిరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదిని ప్రకటించే అవకాశం వుంది

ఈ సినిమాకు కృష్ణ వంశీ దర్శకుడు. కేథరీన్ త్రెస హీరోయిన్. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించాడు. యెల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాలా సినిమాను నిర్మించాడు

Exit mobile version