రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కనిపించనున్న కమల్ హాసన్

kamal_hassan_bday

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇండియాలో ఉన్న ఉత్తమ నటుల్లో ఒకరు. ఆయన ఈ సంవత్సరం ‘విశ్వరూపం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత రమేష్ అరవింద్ డైరెక్షన్ లో కమల్ హాసన్ ఓ మూవీ చేయనున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కమల్ రొమాంటిక్ అవతారంలో కనిపించనున్నాడు. కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రాకారం ఈ సినిమాలో హీరో – హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండనున్నాయని చెబుతున్నారు. ఈ మూవీలో కమల్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ గతంలో రొమాటిక్ సీన్స్ ఎన్నో చేసాడు కాబట్టి ఇదేమీ పెద్ద సర్ప్రైజ్ కాదు. ఈ సినిమాకి ‘ఉత్తమ విలన్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ప్రస్తుతం కమల్ హాసన్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

Exit mobile version