భారీ సినిమాల నిర్మాతగా పేరుతెచ్చుకుని గుర్తుండిపోయే విజయాలను అందుకున్న ఎం.ఎస్ రాజు దర్శకుడిగా సక్సస్ అవ్వడానికి కుడా ప్రయత్నిస్తున్నాడు. ఆయన గతంలో దర్సకత్వం వహించిన ‘తూనీగ తూనీగ’ అంతగా ఆకట్టుకోలేకపోయింది
తదుపరి చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా తీసే పనిలో వున్నాడు. ఈ సినిమాను పూర్తిస్థాయి యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి సినిమా బృందం చాలా కష్టపడింది. చాలా వరకూ గల్ఫ్ దేశంలో తీసిన ఈ సన్నివేశాలను ఫైట్ మాస్టర్ విజయన్ సహకారంలో తీస్తున్నారు. ఈ సినిమా తమిళ మరియు తెలుగు భాషలలొ తెరకెక్కుతుంది
త్రిష, ఛార్మీ, ఇషా చావ్లా మరియు నికీషా పటేల్ ప్రధాన పాత్రలు. మణిశర్మ సంగీత దర్శకుడు