గబ్బర్ సింగ్ 2 కోసం కొత్త హీరోయిన్?

pawan kalyan
అతి త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేసారు, మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. మేము విన్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కొత్త హీరోయిన్ కనిపించనుంది. సంపత్ నంది డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మించనున్నాడు. ఈ మూవీకి కూడా దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని ఆశిస్తున్నారు.

‘గబ్బర్ సింగ్ 2’ గురించి అభిమానులు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వారు ఎదురు చూస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఎంత కాలంగానో పవన్ కళ్యాణ్ ఎదురుచూస్తున్నా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే, రీసెంట్ గా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా పవన్ కళ్యాణ్ ని మంరింత ఉన్నత స్థానాలకు చేర్చింది. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది.

Exit mobile version