వేదిక మారిన ఆడు మగాడ్రా బుజ్జి సినిమా ఆడియో వేడుక

Adu-Magaadra-Bujji
‘ప్రేమకధా చిత్రమ్’ సినిమా విజయంతో ఆనందంగా సుధీర్ బాబు తన తదుపరి చిత్రం ‘ఆడు మగాడ్రా బుజ్జి’ తో మనముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఈ నెల అక్టోబర్ 30న శిల్పకళావేదికలో జరగాల్సివుంది. కానీ ఇప్పుడు ఈ వేడుక నోవోటేల్ కన్వెన్షన్ సెంటర్ కు మార్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ వేడుకకు ముఖ్య అతిదిగా రానున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో అస్మితా సూద్ పూనమ్ కౌర్ హీరోయిన్స్. కృష్ణ రెడ్డి గంగాదాసు దర్శకుడు. శ్రీ సంగీతాన్ని అందించాడు. ఎస్.ఎన్ రెడ్డి మరియు ఎం. సుబ్బారెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు

Exit mobile version