మహేష్ ‘1’కి నవంబర్ నుంచి మొదలు కానున్న డబ్బింగ్

1Nenokkadine
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘1- నేనొక్కడినే’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ఈ నెల 29 నుంచి మొదలు కావాలి. కానీ ఇప్పుడు అది నవంబర్ కి మారింది. మాకు అందిన సమాచారం ప్రకారం నవంబర్ 10 లేదా 11 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలవుతాయి. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కూడా త్వరలో మొదలు కానున్నాయి.

ఈ చిత్ర ప్రొడక్షన్ టీం 2014 జనవరి 10కి సినిమాని రిలీజ్ చేసే దిశగా పనులన్నీ పూర్తి చేస్తున్నారు. ఈ చిత్ర టీం ఇటీవలే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చింది. దాంతో దాదాపు షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు స్టైలిష్ అవతారంలో కనిపించనున్నాడు, అలాగే ఈ మూవీలో కొన్ని స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

కృతి సనన్ హీరోయిన్ గా పరిచయం కానున్న ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Exit mobile version