తమిళ్ సినిమా నిర్మాతల కౌన్సిల్ తమ నిర్మాతలని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు తాజాగా నిర్మాతల మండలి నిర్మాతకి మంచి చేకూరేలా ఓ నిర్ణయాన్ని తీసుకుంది.
ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ తాము నటించే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు. కొంతమంది హీరోయిన్స్ పని పట్ల బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుండడంతో వారు నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్ళారు. ఈ విషయం పై నిర్మాతల మండలి కొన్ని రూల్స్ పాస్ చేసింది. ‘ఇక నుంచి హెఒర్యిన్స్ కి సినిమా షూటింగ్ పూర్తవ్వగానే 80% రెమ్యునరేషన్ ఇస్తారు. ఆతర్వాత వారు ప్రెస్ మీట్స్ కి హాజరయితే ఇంకో 10%, అలాగే ప్రమోషన్స్ కి హాజరయితే మిగిలిన 10% రెమ్యునరేషన్ ని ఇస్తారని’ తెలిపారు.
ఇక నుంచి మొదలు కాబోయే సినిమాలకు నిర్మాతలను ఇలాంటి రూల్స్ ని అమలు చేయమని నిర్మాతల మండలి తెలియజేసింది. దాంతో తమిళ చిత్ర నిర్మాతలు నిర్మాతల మండలికి తమ ఆనందాన్ని వ్యక్తాన్ని చేస్తున్నారు.