వరుణ్ సందేశ్, సందీప్ కిషన్ హీరోలుగా నటించిన ‘డీ ఫర్ దోపిడీ’ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ చీత్ర టీం ఒక ప్రమోషనల్ సాంగ్ ని చేసారు.
ఈ సినిమా నిర్మాతల్లో ఇటీవల నాని కూడా భాగస్వామి అవ్వడమే కాకుండా ప్రమోషన్ సాంగ్ కూడా చేసాడు. ఆ సాంగ్ ని ఈ రోజు దిల్ రాజు, నాని, నిర్మాతలు కలిసి లాంచ్ చేయనున్నారు. దిల్ రాజు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుక్కున్నారు. ఈ సినిమాని ఈ నవంబర్ నెలాఖరున రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మెలోని హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాని డికె – రాజ్ నిర్మిస్తుండగా సిరాజ్ కళ్ళ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మహేష్ శంకర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు.