రవితేజ ‘బలుపు’ సినిమావిజయంతో ఆనందంలో వున్నాడు. ఈ సినిమా ముందువరకు ఫ్లాపుల పరంపరలో కొనసాగిన మాస్ మహారాజ్ ఇప్పుడు తన చిత్రాల ఎంపికను ఆచితూచి వ్యవహరిస్తున్నాడు
‘బలుపు’ సినిమాలో రచయితగా పనిచేసిన బాబీ త్వరలో దర్శకుడిగా మారనున్నాడు. ఈ సినిమాకు ముందుగా రవితేజ స్నేహితుడైన వై.వి.ఎస్ చౌదరి నిర్మిద్దాం అనుకున్నారు. అయతే అకస్మాత్తుగా చౌదరి వెనకడుగు వేయడంతో ఇప్పుడు రవితేజ కొత్త నిర్మాతకోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా 5 నవంబర్ 5 నుండి ప్రారంభంకానుంది
కన్నడ సినిమాలను నిర్మించే ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తో రవి తేజ చర్చలు జరుపుతున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు