2012 లో బిజీ కానున్న రామ్ చరణ్ తేజ్


2009 లో “మగధీర” రికార్డు తరువాత 2010 లో “ఆరెంజ్” తో నిరాశపడిన రామ్ చరణ్ తేజ 2011 లో ఒక్క చిత్రము విడుదల చెయ్యలేదు. కాని 2012 చరణ్ ని కొత్తగా చూడవచ్చు. “రచ్చ” విడుదలకు సిద్దమవుతుండగా వెంటనే “ఎవడు ” మరియు వి.వి.వినాయక్ ల చిత్రాలు సిద్దంగా ఉన్నాయి. ఇవి కాకుండా హిందీ మరియు తెలుగు లో ఒక ద్విభాషా చిత్రం కూడా వస్తుంది. “రచ్చ” చిత్రం కోసం రామ్ చరణ్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు కాస్ట్యూమ్స్ లో,లోకేషన్స్ లో, నృత్యం లో మరియు పోరాట సన్నివేశాలలో కొత్తగా కనిపించేలా జాగ్రతలు తీసుకుంటున్నారు. “రచ్చ” నిర్మాణ సంస్థ కూడా ఖర్చు కి ఏమాత్రం వెనకాడటం లేదు వీరికి ఈ చిత్ర విజయం పై చాలా నమ్మకం కనిపిస్తుంది. 2012 లో రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తాడని ఆశిద్దాం.

Exit mobile version