‘కింగ్’ అక్కినేని నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమా సుమారు 100 థియేటర్స్ లో రిలీజ్ అవుతోందని అంచనా వేస్తున్నారు. సక్సెస్ఫుల్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో మంచి క్రేజ్ తో భాయ్ రేపు రిలీజ్ కానుంది.
వీరభద్రం చౌదరి డైరెక్ట్ చేసిన ఈ మూవీని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ మాస్ ఎంటర్టైనర్ మూవీలో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా కనిపించనుంది. ‘భాయ్’ సినిమాలో బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, సోను సూద్, అజయ్ లాంటి ప్రముఖ నటులు కూడా కనిపించనున్నారు.
‘హలో బ్రదర్’, ‘అల్లరి అల్లుడు’ లాంటి మాస్ కామెడీ ఎంటర్టైనర్స్ తో నాగార్జున బాక్స్ ఆఫీసు వద్ద విజయాలు అందుకున్నాడు. నాగార్జున చాలా రోజుల తర్వాత చేసిన ఈ మాస్ ఎంటర్టైనర్ కూడా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నారు.