సెట్స్ పైకి వెళ్ళిన శ్రీనివాస్ అవసరాల మూవీ

Vaaraahi Chala Chitram banner
మంచి కామెడీ టైమింగ్ తో శ్రీనివాస్ అవసరాల టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తను డైరెక్టర్ గా మారి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని కొద్ది వారల క్రితమే లాంచ్ చేసారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ద్వారా నాగ శౌర్య హీరోగా పరిచయమవుతున్నాడు.

ఈ సినిమా క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు. సిల్లీ మొంక్స్ కి చెందిన సంజయ్ రెడ్డితో కలిసి వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. కళ్యాణి మాలిక్ సగీతం అందిస్తున్న ఈ సినిమా 2014 మొదట్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version