తమిళ్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న కేథరిన్

Catherine-Tresa
‘చమ్మక్ చల్లో’ సినిమాతో తెలుగు వారికి పరిచయమై కేథరిన్ ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా చాన్స్ కొట్టేసింది. ఆ సినిమా తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తాయనుకున్న ఈ భామకి కాస్త నిరాశే ఎదురైందని చెప్పాలి. కానీ తమిళంలో మాత్రం వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

ఇటీవలే తమిళ హీరో కార్తీ సరసన ‘కాళీ’ అనే సినిమా చేయడానికి అంగీకరించింది. తాజాగా ‘కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు’, ‘పరదేశి’ సినిమాలతో పరిచయమైన అధర్వ సరసన ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపింది. ఈ సినిమా ద్వారా ఎఆర్ మురుగదాస్ అసిస్టెంట్ సంతోష్ డైరెక్టర్ గా పరిచయమవ్వనున్నాడు. ఇది కాకుండా కేథరిన్ తెలుగులో నాని సరసన నటించిన ‘పైసా’ త్వరలో రిలీజ్ కానుంది.

Exit mobile version