‘ఏ మైంది ఈ వేళ’ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిషా అగర్వాల్ ఆ తర్వాత చిన్న సినిమాల్లో నటిస్తూ బాగా బిజీ అయిపోయింది. త్వరలోనే నిషా అగర్వాల్ నటించిన ‘డీకే బోస్’ రిలీజ్ కానుంది. అలాగే మరికొన్ని తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది.
గత కొన్ని రోజులుగా నిషా ఓ బిజినెస్ మాన్ తో ప్రేమ వ్యవహారం నడుపుతోందని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్నీ నిషా కూడా ఖరారు చేసింది. తాజాగా ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు? వీరి పెళ్లి ఎప్పుడు అనే వార్తలకు తెరపడింది. నిషా అగర్వాల్ ముంబై కి చెందిన కరణ్ వలేచ అనే ఓ బిజినెస్ మాన్ ని ప్రేమిస్తోంది. వీరిద్దరి పెళ్లి రానున్న డిసెంబర్ 28న ముంబైలో జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
నిషా మరియు తన ఫ్యామిలీ మెంబర్స్ తనపై ఫిల్మ్ ఇండస్ట్రీ వారు ఇచ్చిన సపోర్ట్ కి తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. 123తెలుగు.కామ్ తరపున నిషాకి అడ్వాన్స్ గా పెళ్లి విషెస్ చెబుతున్నాం..